Nagulapadu Temple: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణంలో పలువురు దంపతులు పాల్గొని పూజలు చేశారు. స్వామి వారికి ఉదయాన్నే పంచామృతాభిషేకాలు జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదం అందించారు.
వైభవంగా శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
Nagulapadu Temple: నాగులపాడులోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
అంగరంగ వైభవంగా శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం