Subject Teacher Policy in AP to Reduce Teachers: సబ్జెక్టు టీచర్ విధానంపై ప్రభుత్వ నిర్ణయమెంటో..! Subject Teacher Policy in AP: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 1నుంచి 5వ తరగతులకు బోధించటానికి.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకే షన్ చేసిన వారే అర్హులంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు ప్రకారం రాష్ట్రంలో అమలవుతున్న సబ్జెక్టు టీచర్ విధానంపై సందిగ్ధత ఏర్పడింది.
రాష్ట్రంలో పాఠశాలల విలీనం తర్వాత 3నుంచి 5 తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లతో బోధన జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఉండటంతో.. తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుదోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Education system: ఉత్తరాంధ్ర విద్యా వ్యవస్థ అభివృద్ధి శూన్యం
ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే వారు హయ్యర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలని, డీఎల్ఈడీ అర్హతతోపాటు టెట్ అర్హత సాధించి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాజస్థాన్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కేసులో ఈ తీర్పు ఇచ్చింది. బీఎడ్ అర్హత అనేది ప్రాథమిక స్థాయి పాఠశాలలకు కాదని, ఆ నైపుణ్యం, శిక్షణ వేరని పేర్కొంది.
డీఎల్ఈడీ శిక్షణ కోర్సు నైపుణ్యాలు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అనుగుణంగా ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో బీఎడ్ అర్హతను తీసుకురావడం వల్ల విద్య నాణ్యత తగ్గుతుందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సబ్జెక్టు టీచర్ల విధానమంటూ 3,4,5 తరగతుల వారికి బీఎడ్ వారితో బోధన చేయిస్తోంది. నూతన విద్యా విధానం పేరుతో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తీసుకొచ్చింది.
Teachers Shortage: పురపాలక బడుల్లో పాఠం పూజ్యం... పిల్లల అభ్యసనానికి ఇబ్బందులు
ఇప్పుడు ప్రాథమిక స్థాయి బోధన డిప్లొమా వారే చెప్పాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో సబ్జెక్టు టీచర్ల విధానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.
విద్యావేత్తల సూచనలు: ప్రాథమిక విద్యను అందించేందుకు విద్యార్థుల మానసిక అవసరాలను అర్ధం చేసుకోవడం, సమస్యను పరిష్కరించడం కీలకమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. దీనికి విరుద్ధంగా బహుళ సబ్జెక్టు ఉపాధ్యాయుల విధానం ఉంటే ఉపాధ్యాయుడు పిల్లల మధ్య భావోద్వేగ బంధం ఉండదని అభిప్రాయపడుతున్నారు.
జాతీయ విద్యా విధానం-2020ప్రకారం ప్రాథమిక దశ 1, 2 తరగతులకు బోధనా పద్ధతులు కార్యాచరణ ఆధారిత విధానం ఉండాలి. సన్నాహక దశలో 3 నుంచి 5 తరగతులకు ఆట ఆధారిత నుంచి పాఠ్య ఆధారిత అభ్యాసానికి క్రమంగా మారతారు. పాఠ్యప్రణాళిక లక్ష్యం పిల్లలు ఫౌండేషనల్ స్కిల్క్‌పై పట్టు సాధించేలా చేయడమేనని 2020 విద్యా విధానం పేర్కొంది.
new education policy: రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు
ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఎత్తుగడ: మధ్య దశలో 6 నుంచి 8 తరగతుల వారు పాఠ్యపుస్తకాలను అర్ధం చేసుకోగలుగుతారు. వీరికి సబ్జెక్టు ఉపాధ్యాయులతో వివరంగా బోధించవచ్చని సూచించింది. కానీ, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, ప్రాథమిక పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా సబ్జెక్టు టీచర్‌తో బోధనను తెరపైకి తెచ్చింది.
తరగతుల విలీనం కారణంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయి. 3.4,5 తరగతులను ఉన్నత, ప్రాథమికో న్నత బడులకు తరలించడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ ఏడాది పిల్లల ప్రవేశాలు తగ్గడంతో బడులు మూతపడ్డాయి.
ప్రభుత్వం నిర్ణయం కారణంగా ప్రాథమిక విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో సెకండరీ గ్రేడ్ టీచర్లను మిగులుగా తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా ఎస్టీటీ టీచర్ పోస్టులు అదనంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రాథమిక విద్యను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం తరగతులను విడదీసి బడులు మూతకు కారణమవుతోంది.
విద్యా విధానంలో భారీ మార్పులు