కొవిడ్ రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ వర్తింపచేసే విధంగా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ లేదని తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ వర్తింప చేసే విధంగా ఆ ఆసుపత్రుల నుంచి పత్రాలు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యతల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే.. ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే విధంగా కమిటీని వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్దేశిక నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులకు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
'ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా రద్దు'