ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ - Sub Collector Mayuri Ashok latest news

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొవిడ్ కేర్ సెంటర్లను సబ్ కలెక్టర్ మయూరి అశోక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడి రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సబ్ కలెక్టర్
sub collector

By

Published : May 20, 2021, 7:44 PM IST

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని పరిధిలో గల పలు మండలాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొవిడ్ కేర్ సెంటర్లను సబ్ కలెక్టర్ మయూరి అశోక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడి రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.

అలాగే వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు గ్రామంలో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​ను తనిఖీ చేశారు. అక్కడ కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులందరికి వెల్కమ్ కిట్స్ ఇచ్చారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేస్తున్న లే ఔట్లను పరిశీలించారు.

ఇదీ చదవండీ…ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖ

ABOUT THE AUTHOR

...view details