గుంటూరు జిల్లా తెనాలిలో రోజూ దాదాపు ముప్పై నుంచి నలభై కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కలెక్టర్‌కు నివేదించినట్లు సబ్ కలెక్టర్ మయూరి అశోక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు మరోసారి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రదేశాలలో కొవిడ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న కరోనా కేసులు... మరో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన - sub collector ashok latest news
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ అశోక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో కొవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్‌కు అవకాశం లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు.
పెరుగుతున్న కరోనా కేసులు... మరో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని అశోక్ తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్‌కు అవకాశం లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. కొవిడ్ బాధితులకు పెట్టే భోజనం నాణ్యతపై తనకు ఫిర్యాదు వచ్చిందని.. రెండు రోజులలో నాణ్యతపై మార్పు రాకపోతే ఆ కాంట్రాక్టర్‌ని తొలగించి మరో కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పగిస్తామన్నారు.