గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మువానిపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 18మందికి కడుపులో నొప్పి.. ఆ తర్వాత వాంతులైనట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు.. వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఆరుగురిని ఇంటికి పంపించారు. మిగతా 12మందిని మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వాసుపత్రికి 108లో తీసుకెళ్లారు. చికిత్స అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆహారాన్ని పరీక్షల కోసం పంపించారని.. నివేదిక వస్తే అస్వస్థతకు కారణాలు తెలిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత - Students fell ill latest news
మధ్యాహ్న భోజనం తిన్నాక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు.. పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మువానిపాలెం పాఠశాలలో జరిగింది.
![మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత Students who ate lunch and fell ill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10898284-547-10898284-1615037253070.jpg)
అస్వస్థతకు గురైన విద్యార్థులు