ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

students missing: అదృశ్యమైన నలుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం - tadepalli

students missing
students missing

By

Published : Dec 7, 2021, 7:49 AM IST

Updated : Dec 7, 2021, 2:22 PM IST

07:44 December 07

మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యం

విద్యార్థుల అదృశ్యం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం సృష్టించిన నలుగురు విద్యార్థుల అదృశ్య ఘటన సుఖాంతమైంది. బల్లావారిపాలెంలో విద్యార్థులను పోలీసులు గుర్తించారు. కాసేపట్లో విద్యార్థులను మంగళగిరికి తీసుకురానున్నారు.

నిన్న మంగళగిరిలోని పాఠశాల నుంచి విద్యార్థులు అదృశ్యమయ్యారు. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. రాజీవ్ గృహకల్పకు చెందిన విద్యార్థులు వెంకటేష్, ప్రభుదేవా, సంతోష్‌.. ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. మరో విద్యార్థి వెంకటేశ్‌ ఎర్రబాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం స్కూల్‌కి వెళ్లి బ్యాగులు తరగతి గదిలో పెట్టి బయటకు వెళ్లిపోయారు.

మళ్లీ సాయంత్రం వచ్చి బ్యాగులు తీసుకొని వెళ్తుండగా ఉపాధ్యాయులు గమనించి పాఠశాలకు రాకుండా ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు రావాలని చెప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎర్రబాలెంలోని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి వెంకటేశ్‌తో కలిసి మిగిలిన ముగ్గురూ సాయంత్రం 7గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసి వారి ఆచూకీ కనుగొన్నారు.

ఇదీ చదవండి:

YSRCPLeaderWarn To MPDO: 'చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం'..ఎంపీడీవోకు వైకాపా నేత వార్నింగ్ !

Last Updated : Dec 7, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details