ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడుకోవటానికి వెళ్లి.. అనంతలోకాలకు... - గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో ఇద్దరు విద్యార్థులు మృతి

కృష్ణా నదిలోకి ఆడుకోవటానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా అమరావతిలో జరిగింది. మృతులు ఒకరు 8వ తరగతి చదువుతుండగా.. మరొకరు 4వ తరగతి చదువుతున్నారు.

students  died at krishna river in guntur district
ఆడుకోవటానికి వెళ్లి.. అనంతలోకాలకు

By

Published : Mar 2, 2021, 4:31 PM IST

ఆడుకోవటానికి కృష్ణా నదిలోకి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తోట వెంకట నాగసాయి(14), పొట్లూరి గోవర్ధన్(9) ఆదివారం ఆడుకోవటానికి కృష్ణా నది వద్దకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ప్రయోజనం లేకపోయింది.

సోమవారం అమరావతి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మంగళవారం కృష్ణా నదిలో మృతదేహాలు నీటిలో తెలియాడుతూ కనిపించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకట నాగసాయి 8వ తరగతి చదువుతుండగా, గోవర్ధన్ 4వ తరగతి చదువుతున్నాడు.

ఇదీ చదవండి:ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details