ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ వైపు చదువు.. మరోవైపు కౌన్సిలర్​గా గెలుపు - tenali updates

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో 22 ఏళ్ల విద్యార్థి.. వార్డు కౌన్సిలర్​గా ఘన విజయం సాధించారు. ఒక పక్క చదువుకుంటూ.. మరోపక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.

student won the tenali municipal elections
మున్సిపల్ ఎన్నికల్లో 22 ఏళ్ల విద్యార్థి ఘన విజయం

By

Published : Mar 16, 2021, 7:12 PM IST

Updated : Mar 16, 2021, 7:44 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని వార్డు కౌన్సిలర్​గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అత్యంత పిన్న వయసులో రాజకీయ తీర్థం పుచ్చుకున్న రమావత్ కవిత భాయి (22).. వైకాపా నుంచి 29వ వార్డు కౌన్సిలర్​గా గెలిచారు.

చదువుకుంటూ.. మరోపక్క వార్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల కర్మకాండలకు స్థలాన్ని కేటాయించాలని వార్డు ప్రజలు కోరినట్లు ఆమె తెలిపారు. వెంటనే ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో 22 ఏళ్ల రమావత్ కవిత భాయి ఘన విజయం

ఇదీ చదవండి

తెనాలి మున్సిపాలిటీలోని ముగ్గురు అధికారులకు కరోనా

Last Updated : Mar 16, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details