గుంటూరు జిల్లా చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినికి వింత అనుభవం ఎదురైంది. నవంబర్14న బాలల దినోత్సవం సందర్భంగా... కావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే బుగ్గలు నిమరటంతో ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏదో అనాలని అనుకున్న ఆమె... చిన్నపిల్లాడి చర్యగా భావించి నవ్వుతూ ముందుకెళ్లారు. వాస్తవానికి ఆ కుర్రాడు ఎమ్మెల్యేకు కరచాలనం చేయాలని భావించాడు. కానీ అది కుదరదని అనుకున్నాడో ఏమో... ఉన్నట్లుండి బుగ్గలు నిమరటంతో అందరూ ఆశ్చర్యపోయారు. బుడతడు మాత్రం సంబరంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మా ఎమ్మెల్యే ముద్దొచ్చింది... బుగ్గలు నిమిరిన బుడతడు..!
ప్రజాప్రతినిధులు పాఠశాల సందర్శనకు విచ్చేసినప్పుడు పిల్లలు సాధారణంగా కరచాలనం చేసి సంతోషిస్తారు. కానీ ఓ విద్యార్థి ఏకంగా ఎమ్మెల్యే బుగ్గలు నిమిరి తెగ సంబరపడిపోయాడు. ఆ చిలిపి పనికి కోపం తెచ్చుకుందామనుకున్నా.. చిన్నపిల్లాడే కదా అని ఆ ఎమ్మెల్యే నవ్వేశారు. ఈ వింత అనుభవం చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినికి ఎదురైంది.
చిలకలూరిపేట ఎమ్మెల్యే బుగ్గలు నిమిరిన ఓ విద్యార్థి
Last Updated : Nov 26, 2019, 10:12 AM IST