గుంటూరు జిల్లా నరసరావుపేటలో సహ విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురైన విద్యార్ధిని అనూష మృతదేహానికి శవపరీక్ష పూర్తైంది. నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో అనూష స్వగ్రామం గోళ్లపాడు తరలించారు. అనూషకు విద్యార్థి సంఘాలు జోహార్లు అర్పిచాయి.
అనూష మృతదేహానికి శవపరీక్షపూర్తి.. స్వస్థలానికి మృతదేహం తరలింపు - గుంటూరులో విద్యార్థిని హత్య తాజా వార్తలు
నరసరావుపేటలో సహ విద్యార్థి చేతిలో హత్యకు గురైన విద్యార్ధిని అనూష మృతదేహానికి శవపరీక్ష పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూషను.. తోటి విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి ఆటోలో తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువ పక్కనే చెత్తలో కప్పేసి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు బుధవారం మృతదేహంతో రోడ్డుపై ధర్నా చేశాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. నిందితుడికి త్వరగా శిక్షపడేలా చేస్తామంటూ.. పోలీసులు ఆందోళనకారులను శాంతిపంజేశారు.
ఇదీ చదవండి:సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం