గుంటూరులో జిల్లాలో జరిగిన యువజనోత్సవాల్లో విద్యార్థులు కొత్త పరికరాలు ప్రదర్శించారు. పంటలకు క్రిమిసంహారక మందులు వేసే సమయంలో రైతులు శారీరక శ్రమకు గురవుతుంటారు. ఈ బాధ గుర్తించిన శ్యామ్ తక్కువ ఖర్చుతో మూడు చక్రాల వాహనాన్ని తయారు చేశాడు.
విజయవాడకు చెందిన శ్రీకాంత్ జీపీఎస్ కనెక్టెడ్ సిస్టం ద్వారా పిచికారి చేసే డ్రోన్ తయారు చేశాడు. ఎకరం పొలాన్ని కేవలం పదినిమిషాల్లో పిచికారి చేయవచ్చని అంటున్నాడు శ్రీకాంత్.
ఏటా రోడ్డు ప్రమదాల సమస్యలు ఎక్కువైపోతుంది. నిద్రమత్తు, మద్యం సేవించి వాహనం నడిపినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేసే స్మార్ట్ సీట్ బెల్ట్‌ను తయారుడు చేశాడు అభిషేక్.