గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓగేరు వాగులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. పసుమర్రు వంతెన వద్ద వీక్షిత్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓగేరు వాగులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. పసుమర్రు వంతెన వద్ద వీక్షిత్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు
చిలకలూరిపేట పట్టణంలోని వెంగళరెడ్డి నగర్‌కు చెందిన విద్యార్థులు బడుగు అఖిల్(7వ తరగతి), మంచికలపూడి చిట్టిబాబు(8వ తరగతి), గారపాటి వరప్రసాద్(7వ తరగతి), గోగులమూడి వీక్షిత్(9వతరగతి), బొల్లాపల్లి సన్ని(10వ తరగతి) స్నేహితులు. అందరూ పట్టణంలోని శారద జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. శనివారం సాయంత్రం ఓగేరువాగులో సరదాగా ఈతకు వెళ్లారు. ఐదుగురు ఈత కొడుతుండగా వాగు ప్రవాహ ఉధృతి ఎక్కువ కావడంతో కొట్టుకుపోయారు . ఆ సమయంలో అక్కడ ఉన్న సింగరపాటి రవి అనే వ్యక్తి.. నలుగురు విద్యార్ధులు.. అఖిల్, చిట్టిబాబు, వరప్రసాద్, సన్నీలను కాపాడారు. గోగులమూడి వీక్షిత్(14) ప్రవాహంలో గల్లంతయ్యాడు.
వీక్షిత్.. పట్టణంలోని శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు. స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విడదల రజిని అధికారులను అప్రమత్తం చేశారు. దీనితో అర్బన్ సీ రాజేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్ సునీల్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ఎప్ బృందాన్ని పిలిపించి గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులు వారికి సమాచారం పంపారు. 18 మంది సభ్యులతో కూడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృంద సభ్యులు చిలకలూరిపేటకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా..పసుమర్రు వంతెన వద్ద వీక్షిత్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది.