గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగి విద్యార్థి గల్లంతు అయ్యాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తమ్మా.తేజశ్విరెడ్డి(18).. స్నేహితులతో కలసి కృష్ణా నదిలో ఈతకు వెళ్ళాడు. ఈత రాకపోవటంతో ప్రమాద వశాత్తు నదిలో గల్లంతు అయ్యాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నిచినా ఫలితం లేకపోయింది. విద్యార్థి కోసం గజ ఈతగాళ్లతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
కొత్తపల్లి గ్రామంలో విషాదం.. కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు - గుంటూరు జిల్లా కొత్తపల్లి గ్రామ విద్యార్ధి కృష్ణా నదిలో గల్లంతు తాజా వార్తలు
స్నేహితులతో కలిసి ఈతకు దిగి.. కృష్ణా నదిలో విద్యార్ధి గల్లంతైన ఘటన.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు వద్ద చోట చేసుకుంది. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నిచినా ఫలితం లేకపోవటంతో.. గజ ఈతగాళ్లతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు