ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండె పోటుతో విద్యార్థి మృతి.. శోకసంద్రంలో స్నేహితులు.. - గుంటూరు న్యూస్​ అప్డేట్స్​

అప్పటి వరకూ తమతో సంతోషంగా క్రికెట్ ఆడిన స్నేహితుడు మృతి చెందడం పై విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫలితంగా కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా, బాపట్లలోని ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో జరిగింది.

Student dies of heart attack in Guntur district
గుండె పోటుతో విద్యార్థి మృతి.. శోకసంద్రంలో స్నేహితులు..

By

Published : Jan 3, 2021, 9:43 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలోని ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. తెనాలికి చెందిన బి. ఉదయ్ కిరణ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అప్పటి వరకూ స్నేహితులతో క్రికెట్ ఆడుతున్న అతను చాతి నొప్పిగా ఉందని కుప్పకూలాడు. కళాశాల యాజమాన్యం తక్షణమే బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. ఈ సంఘటనతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమతో క్రికెట్ ఆడిన స్నేహితుడు మృతి చెందడంపై విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ABOUT THE AUTHOR

...view details