పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ, రూరల్ పరిధిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ తెలిపారు. ఇప్పటికే ఎస్సై, సీఐలతో గ్రామాల్లో సభలు పెట్టించి.. ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. చెడు ప్రవర్తన, రౌడీషీట్లు కలిగిన వారిని బైండోవర్ చేయించాలని ఎస్సై, సీఐలకు సూచించారు.
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వినుకొండలో బందోబస్తు - వినుకొండలో కట్టుదిట్టమైన బందోబస్తు న్యూస్
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వినుకొండలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు..
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వినుకొండలో భారీ బందోబస్తు
ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించామన్నారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.