ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సినిమా టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు' - vakeel saab movie tickets high price

వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు నగరంలోని పలు థియేటర్ల నిర్వాహకులు అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించారు. అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. థియేటర్ల యాజమాన్యంతో మాట్లాడి నగదు వెనక్కి ఇప్పించారు.

సినిమా టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
సినిమా టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

By

Published : Apr 9, 2021, 3:33 PM IST

సినిమా టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ధరలకు సినిమా టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని గుంటూరు తూర్పు ఎమ్మార్వో శ్రీకాంత్ హెచ్చరించారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా పలు థియేటర్ల నిర్వాహకులు అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించారు. కొందరు టిక్కెట్లు కొనలేక అభిమానులు ఇబ్బందిపడ్డారు. అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. థియేటర్ల యాజమాన్యంతో మాట్లాడి నగదును వెనక్కి ఇప్పించారు. కలెక్టర్ ఆదేశాలతో అన్ని థియేటర్లు తనిఖీ చేసినట్లు ఎమ్మార్వో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details