గుంటూరు జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. మందుల దుకాణాలకు తప్ప వేటికీ అధికారులు అనుమతివ్వలేదు. నిత్యావసరాలు, పాలు, కూరగాయల దుకాణాలనూ ఇవాళ మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. సామూహిక ప్రార్థనలను అనుమతించేది లేదంటూ ఇప్పటికే యంత్రాంగం ఆదేశాలు ఇవ్వగా..ఈస్టర్ ప్రార్థనలు ఇళ్ల వద్దే జరుపుకున్నారు.
జిల్లాలో ఇప్పటివరకూ 75 కేసులు నమోదు కాగా.. గుంటూరు అర్బన్ పరిధిలోనే 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు నియోజకవర్గంలోని కుమ్మరిబజారు ప్రాంతంలో ఒకే ఇంటిలో 10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో కంటైన్మెంట్ జోన్లలో అధికారులు, పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దిల్లీ వెళ్లివచ్చిన 9 మంది నుంచి.. 53 మంది వైరస్ బారినపడ్డారు. వీరిని కలిసిన వారిని ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలకు పంపారు.