గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఐజీ ప్రభాకరరావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్లో జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జరిగిన ఘటనలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. చిలకలూరిపేట, వినుకొండ మున్సిపాలటీలతో పాటుగా 184 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 101 ప్రాంతాలలో తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.ప్రైవేట్ వ్యక్తుల వద్ద నున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మూడు నియోజకవర్గాలలో ఇప్పటివరకూ 5 వేల 381 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామన్నారు. మిగతావారిని బైండవర్ చేసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు సూచించామన్నారు.
'ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు' - గుంటూరు జిల్లా నరసారావుపేట డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసున్నట్లు ఐజీ జె.ప్రభాకరరావు తెలిపారు.
ఐజీ జె.ప్రభాకరరావు