ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే వివాదాలకు స్వస్తి పలకండి' - ఎస్​ఈసీ వివాదంపై హైకోర్టు తీర్పు వార్తలు

ఎస్​ఈసీ అంశంలో ప్రభుత్వం ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకాలని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏజీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

cpi ramakrishna
cpi ramakrishna

By

Published : May 30, 2020, 10:49 PM IST

ఎస్​ఈసీ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం వివాదాలు సృష్టించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. రమేశ్‌ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించమని హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తించారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడం తగదని రామకృష్ణ అన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వివాదాలకు స్వస్తి పలికి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details