ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య వార్! అడ్డుకున్న పోలీసులు - గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ వార్తలు

గుంటూరులో 2 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు గొడవకు సిద్ధమయ్యారు. ఓ విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. అయితే సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

stir between two engineering college studentn in guntur
ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య వార్! అడ్డుకున్న పోలీసులు

By

Published : Jun 8, 2020, 1:28 PM IST

గుంటూరు అరండల్‌పేట పిచుకులగుంటలో ఇంజినీరింగ్ విద్యార్ధి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గుంటూరు ఆర్బన్ ఏఎస్పీ గంగాధర్.. అరండల్‌పేట పోలీసు స్టేషన్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఓ విషయంలో 2 కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు గొడవకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రెండు వర్గాలను స్టేషన్​కు పిలిపించి విచారిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details