గుంటూరు జిల్లా మేడికొండూరులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన 400 స్టీలు బాక్సులను (టిఫిన్ బాక్సులు) పోలీసులు పట్టుకున్నారు. 10వ వార్డు అభ్యర్థి శివప్రసాద్ సహా నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు.
ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న 400 స్టీలు బాక్సులు పట్టివేత - గుంటూరు జిల్లా మేడికొండూరులో పంచాయతీ
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 400 స్టీలు బాక్సులను గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. ఓ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు.. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.
ఎన్నికల వేళ తాయిలాలు, ప్రలోభాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టామని.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గుంటూరు అర్బన్ పరిధిలో రేపు ఎన్నికలు జరగనున్న 83 పంచాయతీల పరిధిలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇప్పటి వరకు చెక్‌పోస్టుల వద్ద 13 లక్షలు, బయట మరో 62,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
ఇదీ చదవండి:జనసేన నాయకులపై రాళ్లదాడి.. పదిమందికి గాయాలు