రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల చైతన్య అవగాహన సదస్సు Statewide Voter Awareness Conference:రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఈటీవీ భారత్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్యంపై నిర్వహించిన సదస్సుకు పెద్దఎత్తున యువత హాజరయ్యారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించిన సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు.
Kadapa:కడపలో నిర్వహించిన ఓటరు చైతన్య అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సదస్సుకు వచ్చిన విద్యార్థులకు ఓటు నమోదు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
వైసీపీ ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లైనా తొలగించని ఓటు - పైగా రెండు చోట్ల
Tirupati District:ప్రలోభాలకు లోను కాకుండా ఉత్తమమైన ప్రజాస్వామ్య పాలన అందించే నేతలకు పట్టం కట్టాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఓటరు అవగాహనా సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు.
Annamaya District:అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఓటు నమోదుపై అవగాహన నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువకులు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని దేశానికి దిశా దశ నిర్దేశించగల శక్తి యువతకే ఉందని మంచి ప్రభుత్వాలు రావాలంటే యువత ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
దరఖాస్తు చేసినా జాబితాలో లేని ఓటర్లు - విధుల్లో నిర్లక్ష్యంపై ఆరుగురు బీఎల్వోల సస్పెన్షన్
Nellore District:నెల్లూరు జిల్లా కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో యువత , విద్యార్ధులు ప్రత్యేకంగా ఓటు హక్కును నమోదు చేసుకునే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Alluri District:అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, సంయుక్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎన్నికల డీటీ సత్యనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు ఏ విధంగా వేయాలి వేసిన దానికి ఓటు పడ్డదా లేదా అని చూసుకున్న తర్వాతే పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలని అన్నారు.
లేని తమిళనాడు వలస కూలీలకు ఓట్లు - ఫిర్యాదు చేసినా పట్టించుకోని బీఎల్వోలు
Visakhapatnam:విశాఖ రాంనగర్లోని ఆదిత్యడిగ్రీ కళాశాలలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు ఓటర్ల నమోదు ప్రక్రియను వివరించారు. నమోదు చేసుకున్న తర్వాత వారి వివరాలను పరిశీలన ప్రక్రియలో ఏరకంగా ఉంటుందన్నది తెలియజెప్పారు. కళాశాలలో ఉన్న సిస్టమ్స్ ద్వారా ఓటర్లుగా నమోదు చేయించారు. కొత్త ఓటర్లుగా తాము నమోదు కావడానికి ఏర్పాటు చేసిన అవగాహన శిబిరం ఎంతో ఉపకరించిందని విద్యార్ధినులు ఆనందం వ్యక్తం చేశారు.
East Godavari District:తూర్పుగోదావరి జిల్లా తూర్పు గానుగూడెంలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు- ఈటీవీ, ఈటీవీ భారత్ సంయుక్తంగా ఓటు నమోదు, అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజ పోకడలను పరిశీలించి భవిష్యత్తును చక్కదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.