గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలిని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. జీజీహెచ్లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితులను జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని అడిగి తెలుసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన ఘటనగా వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ - vaasireddy padma latest updates
తాడేపల్లి అత్యాచార బాధితురాలిని రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాడేపల్లి అత్యాచార కేసును పోలీసులు ఛేదిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్
కాబోయే భర్తతో వచ్చి బాధితురాలు అఘాయిత్యానికి గురైందని...త్వరలోనే తాడేపల్లి అత్యాచార కేసును పోలీసులు ఛేదిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చినట్లు ఆమె చెప్పారు. మత్తు ముఠాలు, బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతున్నాయని...అలాంటి మృగాళ్లకు కఠిన చర్యలతో హెచ్చరిక పంపుతామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: