ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారిశ్రామిక రంగం బాగుంటేనే రాష్ట్రాభివృద్ధి'

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి పారిశ్రామిక రంగం బాగుండాలని వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా అన్నారు. పరిశ్రమలు, ఉద్యోగులు రావాలంటే నాయకుడి ఆలోచన బాగుండాలని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆరు నెలల పాలనలోనే 4 లక్షల మందికి ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.

mla roja
mla roja

By

Published : Feb 20, 2020, 10:31 PM IST

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ప్రసంగం

కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశ్రమలు, విద్య అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో రోజా పాల్గొన్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రోజా చెప్పారు. పరిశ్రమలు, ఉద్యోగులు రావాలంటే నాయకుడి ఆలోచన బాగుండాలని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆరు నెలల పాలనలోనే 4 లక్షల మందికి ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలను అందించడంలో విద్యాసంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. యువత నైపుణ్యాలు పెంపొందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details