ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హతలున్న వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలి' - గుంటూరులో వీఆర్వో సమస్యలు

అర్హతలున్న వీఆర్వోలకు పదోన్నతి ఇవ్వాలని ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. వారి సమస్యలను వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

state vro association president  conference on vro problems at guntur
ఏపీ వీఆర్వో అసోసియేషన్

By

Published : Sep 30, 2020, 10:37 PM IST

2012-2014 బ్యాచ్​కు చెందిన 1759 మంది వీఆర్వోలకు ఇప్పటివరకు పదోన్నతులు ఇవ్వలేదని.. ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలని గుంటూరులో కోరారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ప్రభుత్వ తమ సమస్యలు పరిష్కరించలేదన్నారు.

వన్ టైమ్ సెటిల్​మెంట్ ద్వారా వీఆర్వోలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి దగ్గర... వీఆర్వో లను కన్వీనర్​గా నియమించి వారిని డీ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్వోలకు కనీస సదుపాయాలు లేవన్నారు.

ABOUT THE AUTHOR

...view details