పోలీసులకు మూడు బంగారు పతకాలు - gold medals
ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలు సహా మరికొన్ని పతకాలు సాధించారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈనెల 16 నుంచి 20 వరకు జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలు, ఒక రజత పతకం, రెండు విన్నర్ ఛాంపినయ్ షిప్ ట్రోపీలు సాధించారు. గురువారం మంగళగిరి కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ విజేతలను అభినందించారు. వీడియోగ్రఫీ విభాగంలో సుబ్బరాజు (పోలీస్ కమ్యూనికేషన్)కు బంగారు పతకం, ఆనంద్(మచిలీపట్నం క్లూస్ టీం)కు కాంస్య పతకం లభించింది. అలాగే ఫొటోగ్రఫీ విభాగంలో సత్యనారాయణ(విజయనగరం క్లూస్ టీం)కు రజత పతకం, మరో విభాగంలో పవన్ కుమార్, జ్యోతేశ్వరరావుకు బంగారు పతకాలు, శ్రీనివాసరావుకు కాంస్య పతకం దక్కింది.