ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం - మేడికొండూరు వార్తలు

గుంటూరు జిల్లా పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ పోటీలను ప్రారంభించారు.

cricket
పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

By

Published : Jan 22, 2021, 9:42 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో గల ఏసీఏ నరేంద్రనాథ్ క్రికెట్ మైదానంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. నరేంద్రనాథ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో పీఎస్ వెంకటేశ్వరరావు, సత్యంబాబు గుర్తుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమారు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు గుంటూరుకు చెందిన జీఆర్​సీ క్రికెట్ క్లబ్, విజయవాడకు చెందిన గో స్పోర్ట్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. విజయవాడకు చెందిన జట్టు విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details