ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19 నుంచి బడ్జెట్ సమావేశాలు? - బడ్జెట్​పై మంత్రి బుగ్గన స్పందన

ఈ నెల 19 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం.

ap budget session
ap budget session

By

Published : Jun 6, 2020, 7:00 AM IST

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల మూడోవారంలో ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై చర్చించారు.

ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించటంపై తొలుత చర్చ జరిగింది. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు. మొత్తమ్మీద వారం రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కచ్చితమైన తేదీని నేడో రేపో ప్రకటిస్తారు.

శాసనసభ వ్యవహారాలు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ శ్రీనివాసులు తదితరులు.. ముఖ్యమంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ 19న ఉన్నందున ఆ రోజుతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి

11 నుంచి శ్రీవారి దర్శనం.. భక్తులూ ఇవి గమనించండి

ABOUT THE AUTHOR

...view details