దాడులు జరిగే ప్రతి చోటా మేం ఉండలేం కదా: హోంమంత్రి - state home minister sucherita react on political attack in villages
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రాజకీయ దాడులపై హోంమంత్రి భిన్నంగా స్పందించారు. విధ్వంసాలు జరిగే ప్రతి చోటా కాపలా ఉండలేం కదా అని వ్యాఖ్యానించారు.
![దాడులు జరిగే ప్రతి చోటా మేం ఉండలేం కదా: హోంమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3678605-534-3678605-1561628991189.jpg)
మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర హోంమంత్రి
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులు, విధ్వంసాలపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. విధ్వంసాలు జరిగే ప్రతిచోటా కాపాలా ఉండలేమని అన్నారు. ఈ దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరులోని దాక్షిణ్య మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర హోంమంత్రి
TAGGED:
రాష్ట్ర హోంమంత్రి సుచరిత