ఆ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్య శాఖ - కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరిక
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్లల్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావొద్దని సూచించింది.

కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరిక
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు, గుంటూరు నగర పరిధిలోని పలు ప్రాంతాలు, కర్నూలు, కడప జిల్లా, శ్రీకాళహస్తి, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఇదీ చదవండి:విజయవాడలో ఇంటింటి సర్వే.. సిబ్బందికి తప్పని కష్టాలు
TAGGED:
alerts at red zones in state