ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం' - తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు వార్తలు

కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు తప్పుబట్టారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆయన 12గంటల దీక్ష చేపట్టారు. పేదలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

yarapatineni srinivasarao
yarapatineni srinivasarao

By

Published : Apr 30, 2020, 4:41 PM IST

మీడియాతో యరపతినేని

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పక్కనే ఉన్న తెలంగాణాను కరోనా రహితరాష్ట్రంగా మారుస్తానని అక్కడి సీఎం కేసీఆర్ చెబుతుంటే... ఇక్కడ మాత్రం కరోనాతో సహజీవనం చేయాలని చెప్పటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆయన గుంటూరులోని తన నివాసంలో 12గంటల దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు అందించాలని కోరారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details