ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

State Government Employees DA: దసరా పండగ వచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా డీఏ రాలేదు..!

State Government Employees DA: విజయదశమి కానుకగా డీఏలు ఇస్తామని, ఆగస్టు 21న సీఎం జగన్‌ ఇచ్చిన హామీకు అతీగతీ లేకుండా పోయింది. దసరా పండగ వచ్చినా... కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మాత్రం రాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డీఏ లు పండగ కానుకలంటూ.... సీఎం గొప్పగా ఊదరగొడుతున్నారు. చివరకు పండగ వచ్చినా... డీఏ మాత్రం ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

State Government Employees DA
State Government Employees DA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 9:34 AM IST

Updated : Oct 20, 2023, 9:40 AM IST

State Government Employees DA: దసరా పండగ వచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా డీఏ మాత్రం రాలేదు..!

State Government Employees DA: దసరా పండగ వచ్చింది... కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా డీఏ మాత్రం రాలేదు. విజయదశమి కానుకగా డీఏ లు ఇస్తామని, ఆగస్టు 21న సీఎం జగన్‌ ఇచ్చిన హామీకు అతీగతీ లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచనుగా డీఏ లు పడుతుండగా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. వేతనాలే సమయానికి ఇవ్వని ప్రభుత్వం.. డీఏ ఏమిస్తుందంటూ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

AP Government Employees: దసరా కానుకగా డీఏ ఇస్తామంటూ రెండు నెలల క్రితం సీఎం జగన్‌ ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. మరో రెండు రోజుల్లో దసరా పండుగ రానుంది. సీఎం హామీ మాత్రం అమలు కాలేదు. ఆగస్టు 21న విజయవాడలో జరిగిన ఏపీఎన్​జీఓ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో 2022 జులై డీఏను ఇస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు జగన్‌ హామీ గుప్పించారు. ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. దానికి సంబంధించిన దస్త్రంలో ఇంతవరకు కదిలికనే లేదు. ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డీఏ లు పండగ కానుకలంటూ.... సీఎం గొప్పగా ఊదరగొడుతున్నారు. చివరకు పండగ వచ్చినా... డీఏ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై, 2023 జనవరి, జులై డీఏ లను ఇంతవరకు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదు.

Prathidwani: సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా?

AP Government Employees:2022 జనవరి డీఏ మంజూరులోనూ ప్రభుత్వం వాయిదాలు వేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఇస్తామంటూ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలకు లీకులు ఇచ్చింది. వారు బయటకు వచ్చి ప్రకటనలు చేశారు. పండగ వచ్చి వెళ్లినా.... డీఏ రాలేదు. ఆ తర్వాత మార్చిలో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశంలో ఉగాది పండగకైనా ఒక డీఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని... ఉగాది సమయంలో ఉత్తర్వులు వస్తాయంటూ అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులు మరోసారి ప్రకటన చేశారు. ఉగాది వెళ్లినా... ఇవ్వలేదు. దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు మళ్లీ పలుమార్లు డిమాండ్‌ చేశారు. చివరకు దాన్ని జులై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో అందజేశారు. మిగతా బకాయిలను మూడు విడతల్లో జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీతాలే సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం డీఏ లను సకాలంలో ఇస్తుందని తాము అనుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

PRC: పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల ధర్నా

AP Government Employees:2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలతో పాటు ఆర్జిత సెలవుల బకాయిలను సెప్టెంబరులోపు చెల్లిస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినా.... ఇంతవరకు చెల్లించలేదు. రెండు డీఏ లు, ఆర్జిత సెలవుల బకాయిల కింద మొత్తం 2 వేల 7వందల84 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతంలో డీఏ లు ఇవ్వకుండానే జీతాల నుంచి ఆదాయపు పన్ను మినహాయించారు. రాని ఆదాయానికి ఉద్యోగులు పన్ను కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

Jagan Promises to VRA: గౌరవవేతనం పెంచలేదు.. డీఏలు తిరిగి చెల్లించమంటున్నారని వీఆర్​ఏల ఆవేదన

Last Updated : Oct 20, 2023, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details