రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని కృష్ణా నదిలో మూడు లక్షల 80 వేల చేప పిల్లలను నదిలోకి వదిలారు. దేశంలోని ఆక్వా ఎగుమతుల్లో 45 శాతం వాటా రాష్ట్రం నుంచి వెళ్తుందని... ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని నదులు, చెరువుల్లో 25 నుంచి 30 కోట్ల వరకు చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.
ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తాం: మోపిదేవి - కృష్ణా నదిలో చేపపిల్లలను వదిలిన మంత్రి మోపిదేవి
రాష్ట్రంలో ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. చెరువుల్లో 30 కోట్ల వరకూ చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కృష్ణా నదిలో చేపపిల్లలను వదిలిన మంత్రి మోపిదేవి
TAGGED:
aqua sector