రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుక విద్యార్థులకు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్య ప్రదర్శనను మంత్రి సురేష్ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నమూనాలను మంత్రి తిలకించారు. అనంతరం జగనన్న విద్యాకానుకపై అధికారులతో సమీక్షించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన 4 లక్షల 26 వేల 469 మంది విద్యార్ధుల కారణంగా అదనపు కిట్లు అవసరం ఏర్పడిందని మంత్రి పేర్కోన్నారు. పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్, యూనిఫామ్ల నాణ్యత, సరఫరాపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి అన్ని పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక కిట్లు చేర్చాలని అధికారులను ఆదేశించారు.
సకాలంలో జగనన్న విద్యాకానుక అందేలా చర్యలు.. - today Minister Adimulku Suresh review on jagananna vidya kanuka news update
జగనన్న విద్యాకానుకపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షిస్తానని.. నిర్లక్ష్యం లేకుండా అధికారులు నిర్దేశించిన సమయానికి విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేర్చాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్య ప్రదర్శనను మంత్రి సురేష్ ప్రారంభించారు.
విద్య ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి సురేష్