గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం కంతేరులో పర్యటించిన నీలం సాహ్ని అక్కడి నివేశ స్థలాల్లో పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి.... వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడుకు వెళ్లారు. భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా... క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకు ఆమె పర్యటిస్తున్నారు. నీలం సాహ్ని వెంట గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ఆర్డీవో భాస్కరరెడ్డి ఉన్నారు.
భూసేకరణ పనులు పరిశీలించిన సీఎస్ నీలంసాహ్ని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పనుల పురోగతిని, భూ సేకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఇళ్ల స్థలాల పనుల పురోగతి పరిశీలించిన సీఎస్ నీలంసాహ్ని