పరిపాలనా వికేంద్రీకరణ అంటే రాజధానిని మూడు ముక్కలు చేయటం కాదని రాష్ట్ర బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి దాన్ని సమర్థించుకోవటం సిగ్గుచేటని ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు పరస్పర సహకారంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇపుడు వాటిని మూడు ప్రాంతాలకు మారిస్తే సమన్వయం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
"విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలి'' - ap capital news
మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని రాష్ట్ర బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు విమర్శించారు. వైకాపా సర్కార్ రాజధానిని మూడు ముక్కలు చేసి దాన్ని సమర్థించుకోవటం సిగ్గుచేటని అన్నారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న విశాఖ ఏ విధంగా రాజధానికి అనుకూలమని ప్రశ్నించారు. విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని బీసి సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దక్షిణాఫ్రికాలో అక్కడి జాతులకు ప్రతీకగా 3 రాజధానులు ఉన్నాయన్నా ఆయన తెలుగువారికి అలాంటి అవసరం లేదన్నారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న విశాఖ ఏ విధంగా రాజధానికి అనుకూలమని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు, రక్షణ పరంగా విశాఖకు ఇబ్బందులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాలను, శాస్త్రీయమైన అంశాలను, అభివృద్ధి సిద్ధాంతాలను విస్మరించి కేవలం ఆధిపత్య కోణం, రాజకీయ ప్రయోజనాల కోసమే రెండు ప్రధాన పార్టీలు పోట్లాడుకుంటున్నాయని విమర్శించారు. విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని బీసి సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి