రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసనం శంకర్ రావు చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో రోస్టర్ విధానం పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యులలోనూ.. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై త్వరలోనే గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విశ్వవిద్యాలయాల్లో బీసీలకు అన్యాయం: రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో రోస్టర్ విధానం పాటించడం లేదని.. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసనం శంకర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండర్‌లోనూ.. బీసీలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
TAGGED:
state bc welfare association