తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు... నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఉప్పరపాలెం, సీతారామపురం, కసుకర్రు గ్రామాల్లో వరి, చింతలపూడి గ్రామంలో తమలపాకు తోటలను జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తాం: నాగిరెడ్డి
నివర్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని... రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వరి, తమలపాకు తోటలను ఆయన పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తాం: నాగిరెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీగా... హెక్టారుకు రూ.15 వేలుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిందన్నారు. ఈ క్రాఫ్ యాప్లో పేర్లు నమోదు కానీ వారికి కూడా నమోదు చేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తమలపాకు పంటకు ఎకరాకు రూ.30 వేలు మాత్రమే నష్ట పరిహారం అందించేందుకు అవకాశం ఉందన్నారు. అవి కూడా నేరుగా కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలనే వాటిపై చర్యలు తీసుకోవాలని జేసీ దినేష్ కుమార్ స్థానిక అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: