ఉత్సాహంగా మహిళల నైట్ మారథాన్ women night run: మహిళా సాధికారత అనేది మహిళల స్వీయ-విలువ భావాన్ని, వారి సొంత ఎంపికలను నిర్ణయించే సామర్థ్యాన్ని వారి కోసం, ఇతరుల కోసం సామాజిక మార్పును ప్రభావితం చేసే హక్కును ప్రోత్సహించడానికి నిర్వచించవచ్చు. అలాంటి మహిళా సాధికారత థీమ్‌గా హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ ఉత్సాహంగా సాగింది.
ఈ మారథాన్‌లో చిన్నారులు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సాధికారత వైపు పరుగులు తీస్తామంటూ తమ అభిప్రాయాన్ని తెలిపారు. దేశంలో మహిళలందరూ రాత్రి స్వేచ్ఛగా, భయంలేకుండా బయట తిరిగే రోజులు రావాలని కోరుతూ.. మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని మహిళా రన్నర్స్ తెలిపారు.
మహిళా సాధికారత, హక్కులను ప్రోత్సహించడం అనేది ఒక ప్రధాన ప్రపంచ ఉద్యమంలో భాగంగా ఉద్భవించింది. ఇటీవలి సంవత్సరాలలో కొత్త పుంతలు తొక్కడం కొనసాగుతోంది. అంతర్జాతీయ మహిళా సాధికారత దినోత్సవం వంటి రోజులు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ మారథాన్ కూడా అలాంటిదే. గచ్చిబౌలి స్టేడియం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 5కే, 10కే రన్‌ను హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వారు నిర్వహించారు.
గృహిణులు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల మహిళలు కలిసి హాజరైన ఈ కార్యక్రమంలో అందరూ ఆడి, పాడి సందడి చేశారు. గత మూడేళ్లుగా మహిళా హక్కులు, సాధికారత థీమ్‌లతో మారథాన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఇంటా.. బయట పని చేసే మహిళలకు శరీర వ్యాయామం ఎంతో అవసరమంటూ నినాదాలు చేశారు. తోటి మహిళలందరితో కలిసి రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఇవీ చదవండి: