ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో తాత్కాలికంగా నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం - కరోనా కారణంగా జీజీహెచ్​లో తాత్కాలిక నియామకాలు

గుంటూరులో కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా.. జీజీహెచ్​లో తాత్కాలిక నియామకాలు చేపట్టారు. నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.

staff recruited temporarily
staff recruited temporarily

By

Published : May 8, 2021, 4:46 PM IST

కరోనా బాధితులు పెరుగుతున్న కారణంగా గుంటూరు జీజీహెచ్​లో.. తాత్కాలిక ప్రాతిపదికన నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆధ్వర్యంలో.. అభ్యర్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 300 మంది నర్సులకు గాను.. 175 మంది హాజరుకాగా అందరికీ బాధ్యతలు ఇచ్చారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా తాత్కాలికంగా నియమించారు. వీరితో సిబ్బంది కొరతే తీరే అవకాశం ఉందని ప్రభావతి తెలిపారు. మొదటి విడతలో తమను నియమించుకుని 6 నెలలకు బయటకు పంపించేశారని.. రెండో విడతలో అయినా శాశ్వతంగా కొనసాగించాలని ఒప్పంద నర్సులు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details