గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని... 12 ఏళ్లుగా సేవలందిస్తోన్న తమను రెగ్యులర్ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. అనుభవం, వయసు ఆధారంగా.. శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని సీఎం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆందోళన చేస్తున్న నర్సులకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద స్టాఫ్ నర్సుల ఆందోళన - staff nurses protest news
తమను రెగ్యులర్ చెయ్యాలని ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద స్టాఫ్ నర్సుల ఆందోళన