ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి డీఎస్పీగా విశాఖ వనితకు బాధ్యతలు - Tenali DSP latest news update

మార్కాపురం ట్రైని డీఎస్పీగా విధులు నిర్వహించిన స్రవంతి రాయ్​ని తెనాలి డీఎస్పీగా నియమించారు. ఆమె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆమెను పోలీస్​ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి డీఎస్పీగా పనిచేసిన శ్రీలక్ష్మిను నెల్లూరు స్పెషల్ ఎన్ఫ్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అదనపు ఎస్పీగా పదోన్నతిపై నియమితులయ్యారు.

Sravanthirai take charges to Tenali DSP
తెనాలి డీఎస్పీగా స్రవంతి రాయ్​

By

Published : Nov 18, 2020, 12:44 PM IST

గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీగా కె.స్రవంతి రాయ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో.. మార్కాపురం ట్రైని డీఎస్పీగా విధులు నిర్వహించిన స్రవంతి రాయ్​ని తెనాలి డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. కొత్త డీఎస్పీని డివిజన్​లో పని చేస్తున్న పోలీస్​ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తను.. ప్రజలకు మరింత మెరుగైన సేవ చేసేందుకు పోలీస్ శాఖలోకి వచ్చానట్లు తెలిపారు. ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటానన్నారు. కాగా తెనాలి డీఎస్పీగా పనిచేసిన శ్రీలక్ష్మి నెల్లూరు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details