ఈనాడు - సీఎంఆర్ షాపింగ్‌మాల్ సంయుక్తంగా... గుంటూరులో శ్రావణ మహోత్సవం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రావణమాసం విశిష్టతను పండితులు వివరించారు. అనంతరం మహిళల కోసం సంప్రదాయ వస్త్రధారణ, ఆకర్షణీయమైన నవ్వు, బెస్ట్ ఫొటోజెనిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మహిళలు తమదైన శైలిలో ర్యాంప్ వాక్ చేశారు. పట్టుచీరలు ధరించి మెరిశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అయా విభాగాల్లో... సీఎంఆర్, ఈనాడు ప్రతినిధుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది.
గుంటూరులో వైభవంగా శ్రావణ మహోత్సవం - శ్రావణ మహోత్సవం
ఈనాడు - సీఎంఆర్ షాపింగ్‌మాల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రావణ మహోత్సవానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది.
![గుంటూరులో వైభవంగా శ్రావణ మహోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4029570-781-4029570-1564832013879.jpg)
గుంటూరులో వైభవంగా శ్రావణ మహోత్సవం