వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒడిశాకు బయలుదేరింది. ఈ రోజు ఉదయం మూడున్నర గంటలకు 1342 మంది కార్మికులతో బయలుదేరిన ఈ రైలు, ఒడిశాలోని బద్రుక్, జగన్నాథ్‌పూర్ జిల్లాలకు వెళ్లనుంది. జిల్లాలోని తాడేపల్లి, సత్తెనపల్లి, తుళ్లూరు, ఏయిమ్స్, మంగళగిరి, చిలకలూరిపేట మండలాల్లో ఈ కార్మికులంతా పనులు చేసుకునేవారు. వీరందర్నీ బస్సుల ద్వారా మంగళగిరి తరలించి, అక్కడ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ఒడిశాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వీరందరికీ ఒక్కరోజు సరిపడా ఆహారం, మంచినీళ్లను అధికారులు అందజేశారు. ఒక్కో బోగీలో ఒక వాలంటీర్‌ను కేటాయించారు.
గుంటూరు నుంచి ఒడిశాకు శ్రామిక్ రైలు
లాక్డౌన్ కారణంగా పనుల్లేక... తినటానికి తిండి దొరక్క గుంటూరులో ఇబ్బందులు పడుతున్న ఒడిశా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారు. శ్రామిక్ రైలు ద్వారా వలస కార్మికులంతా ఈరోజు తెల్లవారు జామునే బయలుదేరారు.
గుంటూరు నుంచి ఒడిశాకు శ్రామిక్ రైలు