Sr NTR 27th death anniversary: స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్థంతిని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వర్థంతి కార్యక్రమాలను భారీగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్నదానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం నాయుకులందరూ పాల్గొనాలని సూచించారు.
ఎన్టీఆర్ 27వ వర్థంతి.. టీడీపీ కేంద్ర కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు - రాష్ట్ర వ్యాప్తంగా ఏన్టీఆర్ వర్ధంతి వేడుకలు
Sr NTR 27th death anniversary: స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతిని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్నదానం నిర్వహించనున్నారు.
Sr NTR death anniversary programs in all over state