ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాయనాలు చల్లి మిర్చి పంటను నాశనం చేసిన దుండగులు - పోలీసులకు ఫిర్యాదు

కర్షకుని కష్టానికి నష్టం కలిగిన ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగింది. గుర్తుతెలియని దుండగులు 10 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న మిర్చి పంటపై రసాయనాలు జల్లారు. దాంతో పంట వాడిపోయింది. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

spraying chemicals on chilli crop
మిర్చీ పంటపై రసాయనాలను పిచికారీ చేసిన దుండగులు

By

Published : Nov 15, 2020, 8:48 PM IST

Updated : Nov 15, 2020, 10:34 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలోని పొలాల్లో సాగుచేస్తున్న మిర్చి పంటపై దుండగులు రసాయనాలను పిచికారీ చేశారు. దాంతో 10 ఎకరాల విస్తీర్ణంలోని పంట పూర్తిగా వాడిపోయింది. పచ్చగా కళకళలాడాల్సిన పైరు వాడిపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్లూస్ టీమ్ పొలాల వద్దకు చేరుకుని పంటను పరిశీలించారు. జాగిలాలతో గాలించారు. నిందితులు ఎవరు..? ఎలాంటి రసాయనాన్ని పిచికారీ చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 15, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details