ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chine dragging boat: ఆక్వా రైతుల కోసం ఆచార్యుని వినూత్న ఆవిష్కరణ

ఆక్వా రైతులను అనేక సమస్యలు పలకరిస్తూ ఉంటాయి.. సాగులో కొత్త చిక్కులకు కారణమవుతుంటాయి. వారి ఇబ్బందులకు పరిష్కారంగా అరుదైన 'చైన్ డ్రాగింగ్ బోట్' (Chine dragging boat) రూపొందించారు.. నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్. రోజులు పట్టే పనిని గంటల వ్యవధికి తగ్గిస్తూ.. మెరుగైన పంట ఉత్పత్తులకు భరోసా కల్పిస్తున్నారు.

Boat for aqua farmers
ఆక్వా రైతుల కోసం బోటు

By

Published : Jul 27, 2021, 10:11 PM IST

Updated : Jul 28, 2021, 9:04 AM IST

ఆక్వా రైతుల కోసం బోటు

గుంటూరు జిల్లా నిజాంపట్నం రొయ్యల రైతులు.. కొత్తగా చెరువు తయారు చేసుకోవడానికి దాదాపు 2 నెలలపాటు శ్రమించాల్సి వచ్చేది. విలువైన సమయం వృథా కావడమే కాకుండా.. ఖర్చు కూడా భారంగా మారేది. ఇది గమనించిన నాగార్జున విశ్వవిద్యాలయ యువ ఆచార్యుడు తౌసిఫ్ అహ్మద్.. చైన్ డ్రాగింగ్ బోట్‌ను (Chine dragging boat) రూపొందించారు. ఈ మినీ బోట్‌ ద్వారా.. ఒకే వ్యక్తి రోజుకు 5 నుంచి ఆరుసార్లు 20 చెరువుల్ని చదును చేయవచ్చంటున్నాడు.

ఈ బోటు నిర్మాణంలో 3.5 లీటర్ల సామర్థ్యమున్న జీఎక్స్-160 ఇంజిన్ ఉపయోగించిన తౌసిఫ్‌.. లీటర్ పెట్రోల్‌తో 3 గంటల పాటు పనిచేసేలా తీర్చిదిద్దాడు. చైన్ ర్యాగింగ్ బోటుకు పేటెంట్ కూడా సొంతం చేసుకున్న ఈ యంగ్ ప్రొఫెసర్... వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తోటి అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ప్రయోగాలు కొనసాగిస్తున్నాడు. అన్నదాతల సమస్యలు, సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేస్తున్న మహ్మద్ తౌసిఫ్ అహ్మద్.. అందరి అభినందనలు అందుకుంటున్నాడు.

Last Updated : Jul 28, 2021, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details