గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందారు. ఇక్కడ బెయిలీ ఆక్వాఫాం పేరుతో సుమారు 90 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. వీటిలో కొన్ని మాత్రమే పట్టాభూములు కాగా... మరికొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. మత్స్యశాఖ నుంచి అనుమతి పొందేందుకు అసైన్డ్ రైతు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ అసైన్డ్ రైతులెవరూ దరఖాస్తు చేసుకోలేదని.. చెరువుకు ప్రభుత్వ అనుమతులూ లేవని తేలింది. దీంతో ఆక్వా సాగులో నిబంధనలు పాటిస్తున్నారా ?.. ఎలాంటి రసాయనాలు వాడుతున్నారనే విషయంపై నిఘా కొరవడిందన్న విషయం బహిర్గతమవుతోంది. సున్నం, బ్లీచింగ్తోపాటు రసాయనాలు కలిపిన నిల్వ చేయటమే ప్రమాదాలకు కారణమని నిపుణులు తెలిపారు. ఇదే కూలీల పాలిట శాపంగా మారింది. కొత్తగా వచ్చిన ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్-2020 ప్రకారం అక్టోబర్ 31 వరకూ అనుమతి తీసుకునేందుకు గడువు ఉంది. అప్పటికీ అనుమతి తీసుకోకపోతే నోటీసులు ఇస్తామని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు రాఘవరెడ్డి తెలిపారు.
రొయ్యల సాగుకు ఎకరాకు సగటున 3 నుంచి 5 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. బెయిలీ ఆక్వా ఫామ్ ఆధ్వర్యంలో సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున పెట్టుబడులకు కోట్లాది రూపాయలు అవసరం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధితోపాటు మరికొందరు నేతలు ఆర్థికంగా సాయం అందించినట్లు సమాచారం. అందుకే అనుమతులు లేకపోయినా అన్నీ చక్కబెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
ఆ కరెంటే అక్కడి ఇళ్లకు..