మిర్చి అధికంగా సాగయ్యే రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో.... గతేడాది 54 లక్షల ఎకరాల్లో పంట పండించారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, మంచి ధర పలకడంతో.... ఈసారి పంట విస్తీర్ణం మరో 15 శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. పత్తి సహా ఇతర పంటలు వేసే రైతులూ మిర్చికి మారే సూచనలున్నాయి. పంటను తీవ్రంగా దెబ్బతీసే జెమిని వైరస్‌ను తట్టుకునే కొన్నిరకాల విత్తనాల వాడకం వల్ల గత ఏడాది మంచి దిగుబడులు వచ్చాయి.
ఇప్పుడు ఆ రకం విత్తనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఆ రకమే కావాలని రైతులు కూడా అడుగుతుండటంతో... విత్తన సంస్థలు ధరలు భారీగా పెంచేశాయి. గతంలో 10 గ్రాముల విత్తన ప్యాకెట్ రూ.700 ఉండగా..... ఈసారి రూ.12 వందలకు చేరిందని రైతులు వాపోతున్నారు. డిమాండ్ ఉన్న విత్తన రకాలను కొందరు వ్యాపారులు ఎంమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కిలో రూ.81 వేలు ఉన్న విత్తనాల ధరను.... రూ.లక్షా 30 వేలకు అమ్ముతున్నారు.